ఆదమరిస్తే... అంతే!!
26-03-2026 12:10 AM
సంస్థాన్ నారాయణపూర్, మార్చి 25: మండల కేంద్రంలో పాత ఎమ్మార్వో ఆఫీసు పక్కన మంచి నీటి పైపులైన్ మరమ్మత్తు కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. గత పది రోజుల క్రితం పైపు లైన్ రిపేరు కోసం తవ్వి ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు లేకుండా అలాగే వదిలేశారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆ రోడ్డువెంట వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రాత్రిపూట రోడ్డు వెంట ప్రయాణించేవారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉండడంతో గ్రామపంచాయతీ అధికారులు త్వరగా మరమ్మత్తు చేసి గుంతను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.




