calender_icon.png 20 February, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

20-02-2026 12:29:44 AM

కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): వచ్చే నెల 14 నుండి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పదో త రగతి విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో సమావే శం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నెల రోజులు పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అ న్నారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు త మకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రత్యేక తరగతు లను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. 

‘పీఎం శ్రీ‘ పెండింగ్ బిల్లులపై సమీక్ష

 జిల్లాలో పీఎంశ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్ని రకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.