16 July, 2026 | 3:58 PM

బొగ్గు స్కాంపై సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు

11-12-2024 06:57 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): బొగ్గు స్కాంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బొగ్గు బ్లాకుల కేటాయింపులో ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఫిర్యాదు, ఛార్జిషీట్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ తర్వాత ఐదుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఈ మేరకు 341 పేజీల తీర్పును వెలువరించిన కోర్టు నవభారత్ పవర్ ఎండీ వై.హరిశ్చంద్ర ప్రసాద్, నవభారత్ పవర్ ఛైర్మన్ పీ. త్రివిక్రమ ప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా, కేఎస్ చోప్రా, కేసీ సమారియాను నిర్దోషులుగా  ప్రకటించింది. బొగ్గు బ్లాకుల కేటాయింపు ఆరోపణలపై 2006లో విచారణకు  కేంద్ర ప్రభుత్వం అప్పటి ఆదేశించింది.