16 July, 2026 | 4:16 PM

రాహుల్ వినూత్న నిరసన

12-12-2024 12:00 AM

* రక్షణమంత్రికి జెండా, పువ్వు ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గౌతమ్ అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వినూత్న నిరసన తెలిపారు. బుధవారం పార్లమెంట్‌లో నిల్చొని సమావేశాలకు హాజరైన బీజేపీ ఎంపీలకు జాతీయ జెండా, గులాబీలు అందిస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు. ఈక్రమంలో పార్లమెంట్‌లోకి వెళ్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వచ్చి జెండా, గులాబీ అందజేశారు. ఈ ఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగుర్ స్పందిస్తూ ఇతర విషయాల కంటే దేశమే చాలా ప్రాధాన్యమైందన్న విషయాన్ని బీజేపీ నేతలకు తెలిపేందుకే వారికి జెండాలు, గులాబీలు అందజేసినట్లు పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో అదానీ, ప్రధాని మోదీ మాస్కులతో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.