విశ్వ హాస్పిటల్‌లో ప్రత్యేక కన్సల్టేషన్
- మెదడు, వెన్నుపాము, నరాల వ్యాధులపై అవగాహన
- చికిత్సలో ఆధునిక వైద్యం కీలకం
- డాక్టర్ మహేష్ కుమార్ వైదు
సిద్దిపేట, జూన్ 13(విజయక్రాంతి): మెదడు, వెన్నుపాము, నరాల సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పున్ సర్జన్ డాక్టర్ మహేష్ కుమార్ వైదు శనివారం సిద్ధిపేటలోని విశ్వ హాస్పిటల్‌లో ప్రత్యేక కన్సల్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మూర్ఛ (ఎపిలెప్సీ), పక్షవా తం (స్ట్రోక్), మైగ్రేన్, మతిమరుపు, వెన్నునొప్పి, కాళ్లుచేతుల్లో తిమ్మిర్లు, నరాల బలహీనత, మెదడు, వెన్నుపాము సంబంధిత వ్యా ధుల లక్షణాలు, కారణాలు, చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నరాల సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ప్రత్యేక కన్సల్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రోగులను పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్సా సూచనలు అందించా రు. ఆధునిక వైద్య సాంకేతికతతో అనేక నరాల వ్యాధులకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, పక్షవాతం వంటి అత్య వసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స పొం దడం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.






