గణపేశ్వరునికి గాజుల మాలలతో ప్రత్యేక అలంకరణ
22-08-2026 12:45 AM
గణపురం,ఆగస్టు 21 (విజయ క్రాంతి): శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా వరలక్ష్మీ వ్రతం రెండవ శుక్రవారం పర్వదిన సందర్భంగా గణపేశ్వరునికి ఎరుపు, పసుపు గాజులు,, రూపాయి బిల్లల మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. గణపురం మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి సాయిని రమేష్, శ్రీదేవి దంపతులు మాలలను స్వామివారికి అందజేశారు. స్వామి వారికి మాలలను అందజేసిన రమేష్, శ్రీదేవి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.






