26 July, 2026 | 12:37 PM

విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి

26-07-2026 11:30 AM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోయవాగు గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్యాల కేదారి (60) ఇంటి వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఇంటి సమీపంలో ఉన్న బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్‌కు విద్యుత్ సరఫరా అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన విద్యుత్ షాక్‌కు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.