26 July, 2026 | 12:36 PM

రాజక్కపల్లి పెద్దవాగులో మృతదేహం లభ్యం

26-07-2026 11:27 AM

ధర్మపురి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి పెద్దవాగులో ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ కు చెందిన పల్లపు భూమయ్య(35)గా పోలీసులు గుర్తించారు. మృతుడు భూమయ్య శుక్రవారం సాయంత్రం రాజక్కపల్లి పెద్దవాగులో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లభించలేదు.కాగా శుక్రవారం సాయంత్రం పెద్దవాగులో దూకిన భూమయ్య మృతదేహం ఆదివారం ఉదయం లభ్యం అయ్యింది. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.