31 July, 2026 | 3:49 AM

నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

31-07-2026 02:15 AM

అలంపూర్ జూలై 30: మానవపాడు మండలంలోని గోకులపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎంఈఓ శివ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదవడం, రాయడం నైపుణ్యాలను పరిశీలించి వివిధ పాఠ్యాంశాల నుంచి చదివించి, రాయించారు. అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థుల చదవడం, రాయడం నైపు ణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థికి నిరంతర సాధన కల్పించి అభ్యాస ఫలితాలు మెరుగుపరచాలనిఉపాధ్యాయులకు ఎంఈఓ శివప్రసాద్ సూచించారు.