calender_icon.png 10 August, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

09-08-2025 05:30:04 PM

ప్రతి గ్రామానికి పక్కా రహదారుల నిర్మించేదిశగా ప్రణాళిక..

రవాణా సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయి..

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు..

భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు ముమ్మరంగా రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని  కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. పంచాయతిరాజ్ రోడ్ల శాఖ రూ.1.80 కోట్ల నిధులతో మండలంలోని బేతంపూడి నుంచి నల్లవాగు మీదుగా నాన్యతాండా వరకు 2.50కిలోమీటర్ల బిటి రోడ్డు పనులకు శనివారం కూనంనేని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం కల్పించి రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు గ్రామాలు, పట్టణాలను అను సంధానించేందుకు నిరంతర కృషి జరుగుతోందన్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. పంచాయతి రాజ్ శాఖా నుంచి నియోజకవర్గంలో 8.50కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.15కోట్లు మంజూరయ్యాయని త్వరలో పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

రహాదారులతో పాటు ప్రజల కనీస అవసరాలైన విద్యుత్ సౌకర్యం, వైద్యం, డ్రైన్ల, త్రాగునీటి వసతి కల్పించేందుకు చేసిన కృషి ఫలితంగా ఇప్పటివరకు 80శాతం మేర పనులు పూర్తికాగా, కొన్ని గ్రామాల్లో నిర్మాణదశలో ఉన్నాయన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో సమస్యలులేని గ్రామాలు ఆవిష్కృతమవుతాయని, మునుపెన్నడూ లేని అభివృద్ధిని సాధించి చూపెడుతున్నామన్నారు. నిర్మాణ పనుల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే ఉపేక్షించేదిలేదని దీనికి అధికారులే బాధ్యత వహించాల్సిఉంటుందని హెచ్చరించారు. శంఖుస్థాపనికు వచ్చిన ఎమ్మెల్యే కూనంనేనిని శాలువా, పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా దస్రు, మండల కార్యదర్శి కొమారి హన్మంతరావు, జిల్లా సమితి సభ్యులు జక్కుల రాములు, టి.పాపారావు, ధర్మారావు, మూడు గణేష్, కొమారి కృష్ణ, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.