09-08-2025 05:22:40 PM
భారీగా గౌడ బిడ్డలు తరలిరావాలి..
జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్..
కామారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాద్ రవీంద్రభారతిలో జై గౌడ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో గౌడ బిడ్డలు తరలివచ్చి విజయవంతం చేయాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బహుజన చక్రవర్తి పాపన్న జయంతిని కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జై గోడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ అధ్యక్షతన 18వ సారి నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్దా గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, నందివాడ ప్రశాంత్ గౌడ్, రాజంపేట దేవేందర్ గౌడ్, తాటిపాముల భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.