22 May, 2026 | 12:58 AM

బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

22-05-2026 12:07 AM

మున్సిపల్ చైర్పర్సన్ దుబ్బ సోనియా దర్శన్ 

మొయినాబాద్, మే 21 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం మొయినాబాద్లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కౌమార దశలో ఉన్న బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ షాబాద్ సోనియా దర్శన్ పాల్గొని బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు, బాలికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మార్చి 6, 2026 నుంచి జూన్ 12, 2026 వరకు ఈ 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించడం, ఆరోగ్య సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, పూర్తి స్థాయి టీకాలు, బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై పూర్తి సమాచారం అందిస్తున్నారు. ముందస్తు ఆరోగ్య పరీక్షలు, మంచి ఆరోగ్యానికి భరోసా అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.