9 June, 2026 | 1:20 AM

హైరిస్క్ గర్భాలపై ప్రత్యేక దృష్టి

09-06-2026 12:34 AM
  1. ప్రతి నెల 9న పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్  క్యాంపులు
  2. డిఎంహెచ్‌ఓ వెంకటరమణ

సూర్యాపేట, జూన్ 8 (విజయక్రాంతి) :  జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ప్రతి నెల 9వ తేదిన ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరో గ్య శాఖాధికారి డాక్టర్ పెండెం వెంకట రమ ణ తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు ప్రధానంగా హైరిస్క్ గర్భాలను ముందుగానే గుర్తించి, తగిన వైద్య పరీక్షలు, చికిత్స, పర్యవేక్షణ అందింకానున్న ట్లు తెలిపారు.

రక్తపోటు, రక్తహీనత, మధుమేహం వంటి పరీక్షలు చేసి అవసరమైన వై ద్య సలహాలు, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం లు, ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలో గర్భిణీలను గుర్తించి పీఎం ఎస్‌ఎంఎస్ సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 2వ, 3వ త్రైమాసికం లో ఉన్న గర్భిణీలు తప్పనిసరిగా సమీప ప్ర భుత్వ ఆరోగ్య సంస్థను సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత గర్భిణీ సేవలను సద్వినియోగం చేసుకొని తల్లి, శిశు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.