27 July, 2026 | 7:50 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

ప్రజా సమస్యలపై ప్రత్యేక గ్రామసభ

05-06-2026 01:08 AM

బూర్గంపాడు, జూన్4 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

జడ్పి సీఈవో నాగలక్ష్మి గ్రామసభకు హాజరై గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని తెలిపారు.

మురికి కాలువల కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో జమలారెడ్డి, స్థానిక సర్పంచ్ గుండి బాబురావు, ఉప సర్పంచ్ మహంకాళి రామారావు, ఏపీఓ విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ, వివిధ శాఖ అధికారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.