27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

జీహెచ్‌ఎంసీలో ఆధునిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు

05-06-2026 01:08 AM

గచ్చిబౌలిలో పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి

శేరిలింగంపల్లి,జూన్ 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 ఆధునిక సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరుగుతున్నది. గచ్చిబౌలి తాలింలో నిర్మాణంలో ఉన్న తొలి కార్యాలయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రభుత్వానికి భారం లేకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నిర్మాణంతో పాటు ఐదేళ్ల నిర్వహణను కాంట్రాక్టర్ సంస్థలే చూసుకుంటాయి.45 వేల చదరపు అడుగులుగా ప్రతిపాదించిన కార్యాలయాన్ని 75 వేల చదరపు అడుగులకు విస్తరించారు. విశాల హాళ్లు, ఆధునిక సౌకర్యాలతో వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.డిసెంబర్లోపు పనులు పూర్తిచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు దాటుతుందని తెలిపారు.