బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఛాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ బిఎల్‌ఏలు, ముఖ్య నాయకుల విస్తృ త స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో విజయవంతంగా నడిపించి తెలంగా ణ రాష్ట్రాన్ని సాధించామని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను వివరించారు.
రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ తిరిగి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత కట్టుదిట్టంగా పనిచేయాలని అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేపట్టిన పలు కార్యక్రమాలు, సాధించిన నిధులు, అమలవు తున్న అభివృద్ధి పనుల గురించి సమావేశంలో వివరించారు. అలాగే ఓటరు జాబితా లో సర్ అనుసంధాన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ఓటరు నమోదు ధృవీకరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ సమా వేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్, మల్కాజ్గిరి బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మేకల సునీత, రాము యాదవ్, మురుగేష్, పార్టీ నాయకులు జేఏసీ వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, జీకే హనుమంతరావు, అమీరుద్దీన్, అనిల్ కిషోర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కృష్ణ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, ఢిల్లీ పరమేష్, డోలి రమేష్, భాస్కర్ రెడ్డి, అరుణ్ రావు, అరవింద్, శరణ్ గిరి, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, ఉస్మాన్, కేబుల్ రమేష్ , పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






