27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి

25-10-2025 07:25 PM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్,(విజయక్రాంతి): ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ ఆర్ ఓ లతో  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ... 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.

ఇందులో కేటగిరీ "ఎ" లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ "బి" లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ "సి" లో 1987 నుంచి 2002 మద్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ "డి" లో 2002-2007 మధ్యలో జన్మించిన వారిగా విభజించడం జరిగిందని తెలిపారు.

అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి "ఎ" జాబితాను బి.ఎల్.ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని, తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ లో నమోదు చేయబడుతుందని తెలిపారు. అనంతరం కేటగిరి సి, కేటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి "ఎ" కు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఎఈఆర్ఓల ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్ వైజర్లు, బిఎల్ఓలు బిఎల్ఓ యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బిఎల్ఓ లు, బి ఎల్ ఓ సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మొదట కేటగిరి ఎ ఓటరు జాబితాను బిఎల్ఓ యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సి, డి లను కేటగిరి ఎ కు లింక్ చేయడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని అన్నారు. ప్రతి రోజూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.