calender_icon.png 26 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివిధ అభివృద్ధి పనులకు రూ.15 కోట్ల నిధులు

25-10-2025 07:20:56 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణానికి మహర్దశ పట్టనుంది. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాజాగా 15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. పట్టణంలో వివిధ 52 అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని మే 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపమని ఎమ్మెల్యే తెలిపారు.

దీంతో 52 పనులకు గాను రూ. 15 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికికాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులను మున్సిపాలిటీ లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.