calender_icon.png 26 October, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం

25-10-2025 07:25:17 PM

ఎమ్మెల్యే కాలే యాదయ్య..

చేవెళ్లశంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర పలు సమస్యలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.. డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న ప్రజల పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అంగన్ వాడీ భవనం, బస్తీ దవఖాన ఏర్పాటు చేయాలని, రేషన్ బియ్యం ఇక్కడే ఇచ్చే విధంగా చూడాలని, స్మశాన వాటిక కోసం స్థలం కావాలని, సీసీ రోడ్లు నిర్మించాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది.

ఎమ్మెల్యే 2 అంగన్ వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖాన, నూతనంగా మంజూరయ్యే విధంగా చూడాలని, వాటితో పాటు రేషన్ షాప్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెయిన్ రోడ్ నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర వరకు సీసీ రోడ్డు మంజూరు అయిందని, త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తామని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే ప్రజలకు తెలుపడం జరిగింది. ప్రజలు తెలిపిన పలు సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తానన్నారు. అనంతరం కార్మికులకు మంజూరైన లేబర్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.