24 August, 2026 | 10:37 PM

Breaking News

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •  

ప్రత్యేక లివర్ క్లినిక్ ప్రారంభం

13-06-2025 12:00 AM

గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా ప్రారంభించింన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్స హించడం, కాలేయ వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో ముఖ్యమైన అడుగులో భాగంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే సందర్భంగా ప్రత్యేక లివర్ క్లినిక్, ఐబీడీని గురువారం ప్రారంభించింది. లివర్ కేర్ క్లినిక్ ప్రతి సోమవారం, గురువారం పనిచేస్తుందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు.

ఐబీడీ క్లినిక్ మంగళవారం, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ క్లినిక్‌కు డయాగ్నస్టిక్స్, వైద్య, శస్త్రచికిత్స సంప్రదింపులు, ఆహార సలహా, మానసిక ఆరోగ్య మద్దతును కలిపి సమగ్ర సంరక్షణను అందించడానికి రూ పొందించబడ్డాని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అయ్యే ప్రత్యేక డయాగ్నస్టిక్ ప్యాకేజీలు, డిస్కౌంట్లను అందిస్తున్నారు. 

కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువుల హర్షతేజ, ల్యాప్, జనరల్ సర్జన్ డాక్టర్ సృజన్ కుమార్ బి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ చేతన్ మహాజన్, డాక్టర్ నితిన్ కొండాపూర్, సీనియర్ సైకియాట్రిస్ట్, డాక్టర్ జాన్సీ థామస్ సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ కొలుతోడి దేవానంద్ (సీఈఓ, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్), డాక్టర్ ఉషారాణి (సీనియర్ ఫిజీషియన్), డాక్టర్ సుష్మా రాణి సంగం (వైద్య సేవల చీఫ్) పాల్గొన్నారు.