18 July, 2026 | 4:29 PM

Breaking News

రాజీ మార్గమే రాజ మార్గం   •   సామూహిక మరుగుదొడ్లు ప్రారంభించిన కలెక్టర్   •   భూక్య రవి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •  

రాజీ మార్గమే రాజ మార్గం

18-07-2026 04:29 PM

జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాజీ మార్గమే రాజ మార్గం అని, లోక్ అదాలత్ లతో ఇరువర్గాలకు సత్వర న్యాయం అందుతుందని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. శనివారం మండల న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిఫ్ కోర్టు అవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ... లోక్ అదాలత్ లో ఇరు వర్గాల రాజీ కుదుర్చుకుని కేసులనుపరిష్కరించుకోవచ్చనీ, తద్వారా ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని అన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల భవిష్యత్తు కోల్పోతారని, వ్యయ్య ప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు లోక్ అదాలత్ లలో కేసులనుపరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో పలు క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సివిల్ కేసులకు సంబంధించిన దాదాపు కేసులు పరిష్కరించినట్లు కోర్టు అధికారులు తెలిపారు.