26 March, 2026 | 3:40 AM

ఉద్యాన నర్సరీల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

26-03-2026 01:02 AM

ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్

బెల్లంపల్లి, మార్చి 25 : ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మా ట్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వంద ఎకరాల తోటను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన నర్సరీల బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలోని బెల్లంపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రాజంపేటలో ఉద్యాన నర్సరీలను సందర్శించామని, ఈ ఏడాది ఆగ్రో ఫారెస్ట్రీ, నేషనల్ బ్యాంబు (వెదురు) మిషన్ లో భాగంగా రెండు కోట్ల నిధులతో నర్సరీలలో మొక్కల పెంపకంతో పాటు మౌలి క వసతులు కల్పిస్తున్నామన్నారు.ఆయన వెంట ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్, ఇతర అధికారులున్నారు.

వినియోగదారులకు ఇంధన సరఫరా సక్రమంగా అందించాలి

కాగజ్‌నగర్: వినియోగదారులకు ఇంధన సరసర సక్రమంగాఅందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ -ఉట్నూరు ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పెట్రోల్ బంక్ ను జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పెట్రోల్ బంక్ లో జరుగుతున్న లావాదేవీలు, రిజిస్టర్లు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, గాలి మిషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ ఇంచార్జి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.