అల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమం
కొత్తపల్లి, మార్చి 25(విజయక్రాంతి): స్థానిక కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల వేదికగా ని యువ ఆపద మిత్ర పథకం శిక్షణ శిబిరం బుదవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల డాక్టర్ వి. నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విపత్తు నిర్వహణ చాలా కీలకమైన అంశమని, ప్రతి ఒక్కరికీ దీనిపై సమగ్ర అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విపత్తులు అనేక రకాలుగా సంభవిస్తాయని, వాటి నియంత్రణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
తదుపరి 9 తెలంగాణ బెటాలియన్ ఎన్ సీసీ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఏ.కే. జయంత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విపత్తు నిర్వహణ పద్ధతులను తెలుసుకొని, విపత్తు సమయంలో మానవాళికి చేయూతనివ్వాలని తెలిపారు. అవ సరమైన వనరులను సమకూర్చి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా కెడెట్లు నిర్వహించిన విపత్తు నిర్వహణ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాజ్కుమార్ , ఏఎస్‌ఐ మహేందర్, డీవీఆర్ ఆపరేటర్ లక్ష్మారెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.




