30 March, 2026 | 6:20 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం

30-03-2026 04:56 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని సోమవారం నిర్వహించడం జరిగిందని వైద్య అధికారులు సృజన్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్,ఆర్థోపెడిక్స్, కంటి సమస్యలు, డెంటల్ సమస్యలు డాక్టర్లు రావడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరంలో మొత్తం 259 మంది రోగులకు చికిత్స నిర్వహించి  తగిన మందులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో  భాగంగా 49 మంది రోగులకు కామారెడ్డి జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది.

దీనితోపాటు 58 మంది రోగులకు వివిధ రకములైన పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాగిరెడ్డిపేట్ డాక్టర్.సృజన్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్.జి.దీప్తి, ఆర్థోపెడిక్, డాక్టర్.పి.హరిత, కంటి వైద్య నిపుణులు డాక్టర్.వార్షిక  దంత వైద్య నిపుణులు,డాక్టర్ అఖిల్ జనరల్ ఫిజీషియన్  డాక్టర్ శబరిష్,  సూపర్వైజర్, సునంద, సుభాషిణి, స్టాఫ్ నర్స్ మానస, ల్యాబ్ టెక్నీషియన్ గణేష్, ప్రదీప్ ఫార్మసిస్ట్, డిఈఓ బాలకృష్ణ, మెయిల్ వర్కర్ మురళీకృష్ణ, ఎం.ఎల్.హెచ్ పీస్.అజయ్, దేవిదాస్, లావణ్య,రాశి, అపర్ణ, ఎఎన్ఎంస్ అటెండర్ అశ్వక్ మరియు ఆశలు పాల్గొన్నారు.