09-12-2025 12:00:00 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, డిసెంబర్ 8, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం సందర్శించారు. ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతున్న విధానం పై వివరాలు తెలుసుకున్నారు.
ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 కోసం పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ స్వీకరణ పై వివరాలు కామారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు2025 సందర్భంలో అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం కల్పించే కార్యక్రమం పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని, ప్రతి దశలో ఎన్నికల సిబ్బంది సకాలంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ, డీ ఎల్ పి ఓ శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.