calender_icon.png 9 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

09-12-2025 12:00:00 AM

జుక్కల్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి) : జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. హన్మంత్ షిండే నాయకత్వంపై విశ్వాసం ఉంచి, అభివృద్ధి మార్గంలో భాగస్వామ్యం అవ్వాలని సంకల్పంతో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరినట్లు ఆ గ్రామం మాజీ సర్పంచ్ సాయిలు పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ ప్రజల ఆశయాలు నెరవేర్చే పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పనిచేసే నాయకత్వమే ప్రజలకు కావాలన్నారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని  కోరారు.

చేరికల సందర్భంగా గ్రామంలో జోష్, ఉత్సాహం నెలకొంది. నూతనంగా చేరిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘జుక్కల్ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ గెలవాలి ముందుకు సాగాలి‘ అనే నినాదాలు మార్మోగించారు. మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపిటిసి గంగాధర్ పాల్గొన్నారు.