calender_icon.png 9 December, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల నిబంధనలు పాటించాలి

09-12-2025 12:00:00 AM

ఎన్నికల అధికారిని సారిక

నాగిరెడ్డిపేట,నవంబర్ 8 (విజయ క్రాంతి): గ్రామపంచాయతీ సర్పంచ్,వార్డుసభ్యులకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి ఖర్చులు చేయాలని ఎన్నికల ఖర్చుల అధికారిని సారిక అభ్యర్థులకు సూచించారు.నాగిరెడ్డిపేట మండలంలో పలు గ్రామపంచాయతీలో జరిగే సర్పంచి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు,వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఎన్నికల ఖర్చుల అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చులు చేయాలని,నిబంధనలో సర్పంచ్ పోటీ అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలో అంతకుమించి ఖర్చు చేయకూడదని,ఒక వార్డు సభ్యుని స్థానానికి ఎంత ఖర్చు చేయాలో అంతకుమించి ఖర్చు చేయకూడదని ఆమె అభ్యర్థుల ఖర్చుల విషయం వివరంగా తెలియజేశారు.పోటీలో ఉన్న అభ్యర్థులు రోజు ఎంత ఖర్చు చేస్తున్నారో ఖర్చుల వివరాలను అధికారులకు సమర్పించాలని ఆమె ఆదేశించారు.

ప్రజలను ఓటర్లను ఎటువంటి ప్రలోవాలకు గురి చేయకూడదని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆమె హెచ్చరించారు.బ్యాంకుల ఖాతా నుండి ఎన్ని డబ్బులు చేశారు.ఆ డబ్బులు ఏఏ ఖర్చులకు ఉపయోగించారు ఆధారాలతో సహా మండల ఎన్నికల ఖర్చుల అధికారులకు నివేదించాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,ఎమ్మార్వో  శ్రీనివాస్ రావు,మండల ఎన్నికల అధికారులు,ఆయా గ్రామాల సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.