calender_icon.png 16 February, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామంతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

16-02-2026 12:00:00 AM

మహా శివరాత్రి పర్వదిన ప్రత్యేక పూజలు

తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు

శివాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని

స్వామివారి కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు

సనత్‌గర్/కంటోన్మెంట్/ముషీరాబాద్/జవహర్‌నగర్/సికింద్రాబాద్/ఎల్బీనగర్/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): పరమశివుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషా లతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్క రించుకుని నియోజకవర్గ పరిధిలో పలు ఆలయా లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమీర్‌పేటలో..

అమీర్‌పేట డివిజన్‌లోని హనుమాన్ టెంపుల్, గురుమూర్తి నగర్‌లోని శ్రీ వినాయక టెంపుల్‌లను ఎమ్మెల్యే తలసాని శ్రీని వాస్ యాదవ్ దరహించుకున్నారు. ముం దుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఓలు జయం తి, నరేందర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామ న సంతోష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కూతురు నర్సింహ, ప్రకాష్ గౌడ్, కట్టా బలరాం, శివ, సత్యనారాయణ యాదవ్, ఉత్తమ్ సింగ్ తదితరులు ఉన్నారు.

సనత్‌నగర్‌లో..

మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని సెవెన్ టెంపుల్స్‌లో గల శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన ను ఆల య పండితులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, ప్రదీప్ గౌడ్, ఖలీల్, అర్జున్‌గౌడ్, జమీర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.

కంటోన్మెంట్ : వివిధ ఆలయాల్లో పరమేశ్వరుని సందర్శించిన ఎమ్మెల్యేలు మాధవ రం, తలసాని, మాజీ కార్పొరేటర్ ముద్దం, జంపన ప్రతాప్, విద్య వతిపాండు యాదవ్, రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని, మహాశి వుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని,అందరికీ మహా శివరా త్రి శుభాకాంక్షలు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలియజేశారు. మహా శివరాత్రి సందర్భంగా కూకట్ పల్లిలో వివిధ శివాలయాల్లో ఎమ్మెల్యే మా ధవరం కృష్ణారావు పూజలు నిర్వహించారు.

ఓల్డ్‌బోయిన్‌పల్లిలో..

ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఓల్డ్ బోయిన్ పల్లి తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మనసారా ప్రార్థించారు.

న్యూ బోయిన్‌పల్లిలో రుద్రాభిషేకం..

మహా శివరాత్రి పర్వదినం పురష్క రించుకుని రెండో వార్డు శివాలయనగర్‌లోని కాశీ శివలింగేశ్వర స్వామి,ఆరవ వార్డు శివపంచాయతన హనుమాన్, న్యూబోయిన పల్లిలోని భోళా శంకర్,బాపూజీనగర్ ఆలయల్లో శంకరుడుకి జంపన ప్రతాప్ ప్రత్యేక రుద్రాభి షేకం, అర్చన పూజలు నిర్వహించారు. 

ఆరో వార్డ్‌లో విద్యావతి పాండు యాదవ్ పూజలు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరో వార్డులో న్యూ బోయిన్‌పల్లి సీతారాంపురంలోని శివ పంచాయతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో బోర్డు మాజీ సభ్యుడు విద్యావతి పాండు యాదవ్ ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు, ప్రధాన ఆలయంలో లింగాకారుడైన శివునికి ప్రత్యేక అభిషేకాలు,అర్చనలు పూజలు నిర్వహించారు.

ముషీరాబాద్ : మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం ముషీరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివనామ స్మరణలతో ఆధ్యాత్మికత వెల్లు విరిసింది. ముషీరాబాద్ శివాలయం చౌర స్తా వద్ద గల గౌరీ శంకర ఆలయంలో ఆల య కమిటీ చైర్మన్ పీ. శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో జరిగిన శివరాత్రి మహోత్సవాలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ హాజరై ప్రత్యేక చేశారు.

భోలక్‌పూర్‌లో ప్రసిద్ధిగాంచిన భవాని శంకర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించారు. మాజీ గవర్నర్ బం డారు దత్తాత్రేయ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో భవాని శంకర్ ఆలయ కమిటీ చైర్మన్ మేడి సురేష్ కుమార్, భోలక్ పూర్ డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి ,ఆకుల అరుణ్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు డి. శివ ముదిరాజ్, దీన్ దయా ల్ రెడ్డి, టెంట్ హౌస్ శ్రీనివాస్, వెంకటేష్, ముచ్చకుర్తి ప్రభాకర్, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ డివిజన్‌లో..

పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం గాంధీనగర్ డివిజన్‌లోని వివేక్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ భవా ని శంకర్ దేవాలయంలో స్వామిని గాంధీనగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ కుమార్‌తో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దేవనాథం, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు పీ. నర్సింగ్ రావు, సురేష్ రాజు,ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శివరాత్రి వేడుకలు..

జవహర్‌నగర్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ లోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఆదివారం ఉదయం నుండే ఆల యాల్లోని భక్తులు క్యూలైన్‌లో నిలబడి మహా శివుడిని దర్శించుకున్నారు భక్తి పారవశంతో ప్రజలు ఉపవాసాలు, శివ నామ స్మరణతో ఆ బోలా శంకరుని స్మరిస్తూ భక్తి సంద్రంలో తేలియాడారు. ఆదివారం జవహర్ నగర్‌లోని భక్తులు శివరాత్రి జాగారా లు చేస్తూ భజనలు సంకీర్తనల్లో మునిగి పోయారు. ఉపవాసాలతో భక్తులు శివ శివ అంటూ తలుచుకున్నారు.

సికింద్రాబాద్ ఆలయాల్లో భక్తుల కిటకిట...

సికింద్రాబాద్ :  మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని పలు ఆల యాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు శివపార్వతులను దర్శించుకునేందు కు ఆలయాలు పోటెత్తారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటటలాడాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ వైఎంసీఎ వద్ద గల శివాలయం, వెస్లీ కాలేజీ సమీపంలోని హనుమాన్ దేవాలయంలోని శివాలయం,  మహేంద్రా హిల్స్‌లోని పహాడీ మనుమాన్ ఆలయంలోని  శివపార్వతుల ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. అలాగే తార్నాకలోని హనుమాన్ దేవాలయం, ఓయూ క్యాంపస్లోని ఎల్లమ టెంపుల్, సీతాఫల్ మం డి, పద్మారావు నగర్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 

కర్మన్‌ఘాట్ ఆలయంలో..

ఎల్బీనగర్ : ప్రసిద్ధ కర్మన్ ఘాట్ ఆలయంలో ఆదివారం మహా శివరాత్రి సం దర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉద యం నుండే భక్తులు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.  సుమారు 50 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చారని, స్వామివారికి రుద్ర హోమం, అభిషేకం చేశారు.

శివరాత్రి సందర్భంగా ఆలయంలో వివిధ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులు కళా వేదికపై శాస్త్రీయ నృత్య, గాన కళారూపాలు ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనా రాయణ రెడ్డి, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయ ణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కవిత, ఓరుగంటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌లో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నియోజకవర్గంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం పండుగ సందర్భంగా వెంగళ రావు నగర్లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంతో పాటు శ్రీ కృష్ణ నగర్లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే స్వామివారికి పాలాభి షేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సృష్టి లయకారుడైన ఆ పరమశివుడు భక్తుల పాలిట భోళా శంకరుడని, నిష్కల్మషమైన భక్తితో కొలిచే సామా న్య భక్తుల కోరికలను సైతం తీర్చే కరుణామయుడని కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక జీవనంలో పరమశివుడికి ఒక విశిష్టమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధి ల్లాలని, ఆ దేవుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.