calender_icon.png 9 August, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో యువకులకు ప్రత్యేక గుర్తింపు..

09-08-2025 06:54:02 PM

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఏ పార్టీలో లేనివిదంగా కాంగ్రెస్ లో యువతకు ప్రత్యేక గుర్తింపు ఉందని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్(Congress District President Sai Charan Goud) అన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఆదిలాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు చేసి, నివాళులర్పించిన అనంతరం యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ గౌడ్ మాట్లాడుతూ, దేశ యువతకు నాయకత్వం, సామాజిక సేవ, దేశాభివృద్ధికి వేదికగా 1960లో స్థాపించిన యువజన కాంగ్రెస్ ఇప్పటికీ యువత ఆశయాలను ముందుకు తీసుకెళుతోందన్నారు. యువత దేశ సేవకు ముందుండాలని పిలుపునిచ్చారు. నూతన యుగానికి యువజన కాంగ్రెస్ మార్గదర్శకం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఫత్ ఖాన్,  అసెంబ్లీ అధ్యక్షుడు నాహీద్, ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాకేష్, నాయకులు మద్దున్ అహ్మద్, గౌతమ్ రెడ్డి, తాహిర్ ఖాన్, రవి తదితరులు పాల్గొన్నారు.