09-08-2025 06:55:53 PM
ఎమ్మెల్యే పద్మావతి సహయ సహకారాల పట్ల హర్షం..
గ్రామ శాఖ అధ్యక్షడు వీరు నాయక్..
కోదాడ: కోదాడ మండల(Kodad Mandal) పరిధిలోని మంగళ్ తండా గ్రామంలో శనివారం భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వీరు గ్రామస్తులతో కలిసి గ్రామంలోని ఆయా కూటలలో ఏర్పాటుచేసిన తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. భక్తి శ్రద్ధలతో గ్రామంలోని మహిళలు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గిరిజనలు సాంప్రదాయం ప్రకారం నిర్వహించే పండుగ అని తెలిపారు. మొలకలను తీసుకొని ఇంటి వద్దకు తీసుకువెళ్లి దేవత విగ్రహాల వద్ద ఉంచడం వలన వ్యవసాయం ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. దీంతో ఆయ కోడళ్ళలో మొలకలను ఏర్పాటు చేసుకొని మహిళలు నృత్యాలు చేయడం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్యే పద్మావతి సహయ సహకారాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిగు, పంతుల్య, వాస్తు, శ్రీను, నాగ్య, రూప్ల, దూర్మా, వెంకన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.