09-08-2025 06:52:14 PM
ప్రముఖ సంఘాసేవకులు అయిత పరంజ్యోతి..
చేగుంట (విజయక్రాంతి): అన్నా చెల్లెలు అక్క తమ్ముడు అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ అని ప్రముఖ సంఘాసేవకులు, జిల్లా వాలీబాల్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి(District Volleyball President Aitha Paranjyoti) అన్నారు. రాఖీ పౌర్ణమి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్నిస్తుందని అన్నారు, నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, అంటూ సీట్లు తినిపించి రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అయిత కుటుంబ సభ్యులు సోదరీమణులకు, సోదరులకు రాఖీ కట్టి అందరికీ రాఖీ పౌర్ణమి, శుభాకాంక్షలు తెలియజేశారు.