27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

28-03-2026 07:51 PM

సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా (99 రోజుల యాక్షన్ ప్లాన్) 7వ వార్డులో పారిశుధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ  మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఏడవ వార్డు కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్ , పలువురు వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.