calender_icon.png 17 February, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లా శివరాత్రి ప్రత్యేక పూజలు

16-02-2026 12:00:00 AM

శివనామ స్మరణలతో మారు మోగిన శైవ క్షేత్రాలు

సుల్తానాబాద్ ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి):పెద్దపల్లి జి ల్లా సు ల్తానాబాద్ పట్టణం లో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం శి వనా మ స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగాయి, శివాలయా ల్లో ద ర్శనలకు భక్తులు పోటెత్తారు, భక్తులు తెల్లవారుజా మునుండే ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు, సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివ దేవాలయంలో, పాతవాడలోని శ్రీ శివాలయం లో అర్చకులు పోలస అశోక్, పారువెళ్ల రమేష్ శర్మ ,

వల్ల కొండ మఠం రమేష్ , వల్లకొండ మ ఠం మహేష్ లు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు, శ్రీ శివాలయం లో చైర్మన్ అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు, శివాలయాల భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు... అలాగే సుల్తానాబాద్ పట్టణం తోపాటు మండలంలోని పలు గ్రామాల్లోను మహాశివరాత్రి పండుగ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు....