16-02-2026 12:00:00 AM
సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 15: సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ గ్రామంలో రాచకొండ పర్యాటక ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రక శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాచకొండ ప్రాంతం ఎన్నో దశాబ్దాల క్రితమే ఒక రాజ్యానికి రాజధాని కేంద్రంగా వెలసిల్లిందని ఈ ప్రాంతమంతా నాటి నుండే శైవ క్షేత్రాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుందని గుర్తు చేశారు.
శైవం విరాజిల్లిన ఈ ప్రాంతం లో నాటి చారిత్రక ఆధ్యాత్మిక శోభను మళ్లీ తిరిగి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాబోయే కాలంలో రాచకొండ ప్రాంతాన్ని చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్త ఉమాదేవి ప్రేమ్ చందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు శ్రీను నాయక్,సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, రాచప్ప సమితి సభ్యులు వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.