హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు
17-08-2024 12:25 AM
- పంద్రాగస్టు, వారాంతపు సెలవుల రద్దీ
- 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న ద.మ.రైల్వే
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం, వారాంతపు సెలవుల రద్దీ కారణంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు జనరల్, సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ బోగీలతో నడుస్తాయనిఅధికారులు వెల్లడించారు. నర్సాపూర్ సికింద్రాబాద్ నర్సాపూర్, కాకినాడ టౌన్ సికింద్రాబాద్ కాకినాడ టౌన్, కాచిగూడ తిరుపతి కాచిగూడ మధ్య ఈ 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
- రైలు నెం. 07175 నర్సాపురం సికింద్రాబాద్. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి 19న ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- రైలు నెం.07176 సికింద్రాబాద్ నర్సాపురం. ఈ నెల 19న సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి 20న ఉదయం 5 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.
- రైలు నెం.07177 కాకినాడ టౌన్ సికింద్రాబాద్. ఈ నెల 17, 19వ తేదీల్లో కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 18, 20 తేదీల్లో ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- రైలు నెం.07178 సికింద్రాబాద్8 కాకినాడ టౌన్. ఈ నెల 18, 20వ తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి 19, 21వ తేదీల్లో ఉదయం 6.30 గంటలకు కాకినాడ్ టౌన్ చేరుకుంటుంది.
- రైలు నెం. 07455 కాచిగూడ5 తిరుపతి. ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి 17న ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- రైలు నెం. 07456 తిరుపతి కాచిగూడ. ఈ నెల 17న రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి 18న ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
- రైలు నెం. 07187 కాకినాడ టౌన్ సికింద్రాబాద్. ఈ నెల 18న ఉదయం 6.30 గంటలకు కాకినాడలో బయలుదేరి 19న ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- రైలు నెం.07188 సికింద్రాబాద్8 కాకినాడ టౌన్. ఈ నెల 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 20న ఉదయం 9 గంటలకు కాకినాడు చేరుకుంటుంది.






