ఘనంగా ప్రారంభమైన దివ్యాంగ బాలబాలికల ఆటల పోటీలు
లక్ష్మీదేవిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి ఆటల పోటీలు మంగళవారం ఎంపీపీ ఎస్ ఇందిరాకాలనీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంఈఓ పి కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొనీ క్రీడలను ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా మైలారం కాంప్లెక్స్ హెచ్ఎం తాటి సూరయ్య హేమ్చంద్రాపురం కాంప్లెక్స్ హెచ్ఎం ధరావత్ తావూరియా, శ్రీనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు రాణి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలు ఆటల కారణంగా తమజీవితం ఎదుగుదలకు. ఎంతో దోహదపడతాయన్నారు. భవిత కేంద్రంలో పిల్లలు మంచిగా ఫిజియోథెరపీ, స్పీచ్ తెరిపి చేయిస్తున్నారని పిల్లల అభివృద్ధికి ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమిస్తున్నారని వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి స్పెషల్ ఎడ్యుకేటర్ జంగం సుమన్, లక్ష్మీదేవిపల్లి మాజీ వైస్ సర్పంచ్ లగడపాటి రమేష్, కే జానకి, కే స్వప్న, ఏ నందిని తదితరులు పాల్గొన్నారు.






