డ్రీమ్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెషర్స్ డే
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ డ్రీమ్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో రాజశ్రీ గార్డెన్స్‌లో “డ్రీం నెక్సస్ 2026” ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ – డ్రీమ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వెంకట్ రెడ్డి లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థులకు విలువైన సూచనలు మరియు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఆయన మాటలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించి, ఫ్రెషర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సాహభరితమైన ప్రదర్శనలు, పరస్పర అభినందనలతో కార్యక్రమం సందడిగా సాగింది. “డ్రీమ్ నెక్సస్ 2026” కార్యక్రమం విద్యార్థులందరికీ ఆనందాన్ని, మంచి జ్ఞాపకాలను అందిస్తూ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి , అతిథులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డ్రీమ్ టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






