03-12-2025 05:35:59 PM
కూచాడి శ్రీహరి రావు..
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీ శ్రీహరిరావు అన్నారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరగా శ్రీహరి రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.