calender_icon.png 9 January, 2026 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు క్రీడల్లో సైతం రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

08-01-2026 05:39:45 PM

శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ హైస్కూల్  డైరెక్టర్ మణిమాల 

తాండూరు,(విజయక్రాంతి): విద్యార్థులు విద్యాతో పాటు క్రీడల్లో సైతం రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ మణిమల అన్నారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు గత రెండు రోజుల నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ క్రీడోత్సవాలు జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు విద్యార్థులకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.  విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ గుణాలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో ఓటమి పాలైన విద్యార్థులు నిరుత్సాహపడరాదని ఓటమిని చాలెంజ్ గా తీసుకొని రానున్న రోజుల్లో విజయం సాధించేలా కృషి చేయాలని ఆమె కోరారు.