08-01-2026 05:33:15 PM
హనుమకొండ,(విజయక్రాంతి): ఎమర్జెన్సీ కాలంలో పనిచేసిన స్వాతంత్ర సమర యోధులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని చిట్టి మల్ల శ్యామ్ రావు అన్నారు. గురువారం హనుమకొండ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చిట్టిమల్ల శ్యామ్ రావు మాట్లాడుతూ... ఇందిరాగాంధీ 1975వ సంవత్సరంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని కూల్చిన సందర్భంగా జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం జరిగింది.
రెండవ స్వాతంత్ర సంగ్రామంగా భావించేటువంటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం విస్తృతంగా జరిగిందని, ఆ సందర్భంగా దాదాపు లక్షల మంది ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అలాంటి సందర్భంలో వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది కార్యకర్తలు జైలు పాలయ్యారు, ప్రత్యేకంగా తయారు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ(మీసా) అని పెట్టీ అందరినీ జైల్లో తోసి, ప్రజాస్వామాన్ని హత్య పడిందన్నారు.
ఆ సందర్భంగా ఇక్కడ పోరాట యోధులకు ప్రభుత్వపరంగా గుర్తింపు కావాలని చెప్పి దాన్ని రెండవ స్వాతంత్ర సంగ్రామంగా గుర్తించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఉద్దేశంతోనే ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని బిజెపి పాలిత ప్రాంతాలలో స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించిందని, తెలంగాణ ప్రాంతంలో కూడా తమను గుర్తించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు.