calender_icon.png 9 June, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.10కే స్పోర్ట్స్ డ్రింక్

11-02-2025 12:23:13 AM

 మార్కెట్లోకి రిలయన్స్ ‘స్పిన్నర్’

న్యూఢిల్లీ: : కాంపా కోలాతో శీతల పానీయాల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ సంస్థ.. తాజాగా స్పోర్ట్స్‌డ్రింక్స్ మార్కెట్లోకీ ప్రవేశించింది. మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో  కలిసి స్పిన్నర్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ఈ డ్రింక్‌ను రూ.10కే  అందించనున్నట్లు రిలయన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

స్పిన్నర్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తీసు కొచ్చేందుకు వివిధ ఐపీఎల్ టీమ్‌లతో జట్టుకట్టినట్లు రిలయన్స్ తెలిపింది. లెమన్, ఆరెంజ్, నైట్రో బ్లూ ఫ్లేవర్లలో ఈ డ్రింక్ లభిస్తుంది.ఫిట్నెస్ ఔత్సాహి కులను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రింక్ తెచ్చినట్లు రిలయన్స్ తెలిపింది