క్రీడలతో ఎంతో ఆరోగ్యం
నిజామాబాద్ డిసెంబర్ 14 (విజయక్రాంతి) : మానవ జీవితంలో క్రీడలు ప్రధాన పాత్ర పోసిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ షటిల్ కోర్ట్ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ ను క్లబ్ కార్యదర్శి స్వామీదాస్, సంయుక్త కార్యదర్శి డాకం సాయిలు, కోశాధికారి కౌడపు శరత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, ఏటిఎస్ శ్రీనివాస్, క్లబ్ మేనేజర్ సురేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్రీడలు క్రీడాకారుల ప్రతిభను దేదీప్యమానం చేస్తాయని ఆయన తెలిపారు.
క్లబ్ సభ్యుల శరీరక శ్రమకు మరింత పదును పెట్టడానికి నూతన గ్రీన్ మ్యాట్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. క్లబ్ అభివృద్ధికి తనవంతు సహాయ, సహాకారాలు అందిస్తానని పేర్కొన్నారు. క్లబ్ ప్రాంగణమంత ఆధునీకరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆ దిశగా క్లబ్ ఉపాధ్యక్షునిగా తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ కు వన్నెతెస్తానని, అందుకు సభ్యుల తోడ్పాటు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రచ్చ మురళి, డాక్టర్ రాములు, అంగీరేకుల సాయిలు, ఆశ నారాయణ, రవిరాజ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






