calender_icon.png 16 December, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సరిహద్దుల్లో చిరుత సంచారం...

15-12-2025 12:27:12 AM

రెండు లేగా దూడలు హతం..

కామారెడ్డి, డిసెంబర్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్ర సరిహద్దుల్లో గల అంబరీ పేట్, ఫరీద్ పెట్ సరిహద్దుల్లో ఒక చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంబర్పేట్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల లేగ దూడ ను చిరుత హాత మార్చినట్లు తెలిపారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు. పట్టుకోవడా నికి పలు చోట్లసీసీ కెమెరాలు బిగించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు చిరుత సంచరించడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.