19-01-2026 12:42:13 AM
సర్పంచ్ కలకోట్ల శైలేందర్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి18: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సర్పంచ్ కలకోట్ల శైలేందర్ అన్నారు.ఆదివారం మండల పరిధిలోని అడివెంల గ్రామంలో రేఖ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేఖా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఆటల్లో గెలుపోటములు సహజమని,గెలుపు కోసం క్రీడాకారులు నిరంతరం శ్రమించాలని అన్నారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు,రేఖ ఫౌండేషన్ చైర్మన్ బోయిలపల్లి రేఖా మాట్లాడుతూ కబడ్డీ పోటీలు నిర్వహించడం వలన యువతకు దేహదారుఢ్యం పెరుగుతుందని,రానున్న రోజుల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో అడివెంల మాజీ సర్పంచ్,ఫౌండేషన్ డైరెక్టర్ మడ్డి పద్మ,నాయకులు పేరెల్లి ఉపేందర్,వజ్జె రవి,తాడూరి గట్టయ్య,బోయిళ్ల తిరుమల్,బొర్ర శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.