calender_icon.png 19 January, 2026 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిన్నెధారిలో 7 డిగ్రీలు నమోదు

19-01-2026 12:44:26 AM

రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ నమోదవుతాయని పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 8.7, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా రాష్ట్రం లో చలి తీవ్రత కాస్త తగ్గింది.