19-01-2026 12:41:19 AM
ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందన్...
ఆదిలాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన, గెలుపు గుర్రాలకే మున్సిపల్ కౌన్సిలర్ టికెట్టు కేటాయించడం జరుగుతోందని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందన్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డా.నరేష్‌జాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ టికెట్ కోసం ఆశవహుల అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు.
డీసీసీ కార్యాలయంలో ఇప్పటి వరకు 134 పైగా ఆశవహులు కౌన్సిలర్ టికెట్ కోసం అప్లై చేసుకున్నారని, ఇంకా దరఖాస్తు చేసుకోని వారు సైతం త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగారాలని అయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజీద్ ఖాన్, మార్కెట్ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఐఎన్టియూసీ జిల్లా అధ్యక్షుడు మునిగేలా నర్సింగ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.