12 June, 2026 | 5:39 PM

ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్

12-06-2026 04:38 PM

- ప్రిన్సిపాల్ ఇస్లావత్ సురేష్

గుండాల,(విజయక్రాంతి): 2026 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి గురుకులంలో చదువుకోవాలని అనుకునే విద్యార్థులకు జూన్ 15 వ తేదీన భద్రాచలం గురుకుల బాలికల కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ తెలియజేశారని ఖమ్మం, భద్రాద్రి రిజియన్ ఆర్సీవో బి. అరుణ కుమారి, గుండాల పీఎం శ్రీ గురుకుల పాఠశాల-కళాశాల ప్రిన్సిపాల్ ఇస్లావత్ సురేష్ లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ కొరకు గురుకులంలో చదువుకోవాలని అనుకొనే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు(టీసీ, స్టడీ, టెన్త్ నెట్ మెమో, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ జీరాక్స్, 8 పాస్ ఫోటోలు) తీసుకొని నేరుగా భద్రాచలంలో స్పాట్ కౌన్సెలింగ్ కు జూన్ 15 న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని వారు ప్రకటనలో పేర్కొన్నారు.