యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి
ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యకు పాలకమండలి వినతి
మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కృషి చేస్తున్నారని అందులో భాగంగా 50 కోట్ల నిధులను మంజూరు చేస్తే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. శుక్రవారం బిర్ల ఐలయ్య నివాసంలో యాదగిరిగుట్ట మున్సిపల్ పాలకమండలి సభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కలిసి నిధులను మంజూరు చేయవలసిందిగా వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి కొరకు సిసి రోడ్లు, డ్రైనేజ్, స్మశాన వాటిక అభివృద్ధి,సోలార్ విధి దీపాలు, పట్టణంలో స్వాగత తోరణాలు వివిధ అభివృద్ధి కొరకు సుమారు అంచనా 50 కోట్ల నిధులు మంజూరు చేయుటకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించి యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకరిస్తానని అన్నారని తెలిపారు.






