26 May, 2026 | 6:11 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గుర్తుతెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి

25-10-2025 12:00 AM

అచ్చంపేట అక్టోబర్ 24: గుర్తు తెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పి మృతి చెం దిన సంఘటన మన్ననూర్ లో చోటుచేసుకుంది. అటవీ శాఖ రేంజర్ వీరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో అమ్రాబాద్ -మన్ననూర్ సమీపంలోని పివిటిజి పాఠశాల దగ్గర ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చుక్కలు దుప్పి మరణించింది.

అటుగా వెళుతున్న ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీం తో వారంతా అక్కడికి వెళ్లి పంచనామా చేశా రు. దాడిలో మరణించిన జింకను వాహనంలో తీసుకెళ్లి అడవిలో ఖననం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామ ని అటవీ అధికారులు వెల్లడించారు. వాహనాలు నడిపే సమయంలో వన్యప్రాణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలనిసూచించారు.