calender_icon.png 25 October, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

25-10-2025 12:00:00 AM

కొండాపూర్, అక్టోబర్ 24: సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కొండాపూర్ తహసిల్దార్ అశోక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి చౌరస్తా పోతిరెడ్డిపల్లి పిఎస్‌ఆర్ గార్డెన్లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. చెక్కులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఉదయం 10 గంటలకు తప్పకుండా హాజరు కావాలని ఆయన సూచించారు.